శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (12:58 IST)

చంద్రబాబుకు ఫోన్లో బర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్!: మోడీ, గవర్నర్లు కూడా..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు (20 ఏప్రిల్)ను పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, గతంలో కేసీఆర్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 66వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్‌ నరసింహన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం బాబుకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు.
 
మరోవైపు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి కూడా ఫోన్ చేసి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీలో సీపీఎం నిర్మాణాత్మకంగా ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.