శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (15:54 IST)

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం: కేసీఆర్

రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముస్లింలకు హైటెక్స్‌లో మంగళవారం ఇఫ్తార్ విందు ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తమిళనాడులో 70 శాతం వరకు రిజర్వేషన్లు ఉన్నాయని, అదే మార్గంలో రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. 
 
మరోవైపు ఆగస్టు 16 నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు నడపాలని బిజ్‌ప్రోస్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
 
ఇకపోతే.. స్థానికత, ఎమ్సెట్ అడ్మిషన్ల వివాదాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. జూలై నెలాఖరుకు వచ్చినా ఎమ్సెట్ కౌన్సిలింగ్ జరగకపోవడం వల్ల వేలాది మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారని, అందుచేత ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని కౌన్సిలింగ్ త్వరలో జరిగేట్లు చూడాలన్నారు.