గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (10:43 IST)

క్రైస్తవులకు 3శాతం కోటా: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు!

క్రైస్తవులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేయించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశాలను పరిశీలించడానికి కూడా హైకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇకమీదట చర్చిల నిర్మాణానికి కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రకటించారు. 
 
తెలంగాణ రాష్ట్రం లౌకిక స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని, ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రాన్ని చూసి పాఠాలు నేర్చుకుంటాయని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని క్రైస్తవులకే కేటాయిస్తామని, దీనివల్ల తమ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను చట్టసభలలో ప్రస్తావించడానికి వారికి అవకాశం మరింతగా లభిస్తుందన్నారు.