గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (12:00 IST)

యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. కేసీఆర్

హుస్సేన్ సాగర్‌ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
 
అక్కడి పర్యావరణ పరిమితులు, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపడుతున్నట్టు కేసిఆర్ వెల్లడించారు. అందులో భాగంగా మొదటి దశలో 40 ప్రదేశాల్లో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలు (స్కై స్క్రాపర్స్) నిర్మించనున్నట్టు తెలిపారు. 
 
కాగా సచివాలయంలో సీఎం కేసీఆర్ సాగర్ ప్రక్షాళన, 40 టవర్ల నిర్మాణంపై ఐదు గంటలపాటు సమీక్ష జరిపి, టవర్లు నిర్మించే ప్రాంతాలను గుర్తించారు. సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.