Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనంతపురంలో కేసీఆర్ పర్యటన: మళ్లీ ఇద్దరు చంద్రులూ కలుస్తారా?

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (10:54 IST)

Widgets Magazine

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే  ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం. అక్టోబర్ 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు వివాహం వెంకటాపురంలో జరుగనుంది. 
 
ఈ  వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనంత పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. దీంతో వెంకటాపురం ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈ వీడియోలో ఉన్నమ్మాయి నా పెళ్లాం.. ఎస్సైతో అఫైర్.. (వీడియో)

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై-2గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ట్రైనింగ్ పూర్తి ...

news

మహిళపై 23 మంది అత్యాచారం.. కారులోకి లాక్కున్నారు.. అక్కడ అవి దొరికాయ్!

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ...

news

శ్రీవారిని దర్శించుకున్నాకే జగన్ పాదయాత్ర.. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ ...

news

యాసిడ్‌ను కూల్‌డ్రింక్స్ అనుకుని తాగేసిన చిన్నారులు.. పుట్టినరోజు వేడుకలో విషాదం

యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో ...

Widgets Magazine