గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (14:16 IST)

తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం : కేఈ కృష్ణమూర్తి

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రంలో త్వరలో భూముల క్రయ విక్రయాలను ఆన్‌లైన్‌లో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్తులు, భూముల రిజిష్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోందన్నారు. రాజధానిగా కర్నూలును మించిన నగరం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలోని ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడమే మేలన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను సమానంగా అభివృద్ది చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశగానే తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం కేఈ వెల్లడించారు.