Widgets Magazine

రాజశేఖర్ తప్పుగా మాట్లాడితే చిరంజీవి అలా చేశారు... ఇప్పుడు కూడా(వీడియో)

గురువారం, 18 జనవరి 2018 (18:37 IST)

chiranjeevi

కత్తి మహేష్- పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదంపై నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ వివాదాన్ని పూర్తిగా సద్దుమణిగేందుకు చిరంజీవి రంగంలోకి దిగాలని సూచించారు. గతంలో నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆయన కారుపై దాడి చేస్తే వెనువెంటనే చిరంజీవి కలుగజేసుకుని రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చిరంజీవి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
ఇదిలావుంటే నటి పూనమ్ కౌర్ మరోమారు ట్విట్టర్లో చేసిన ట్వీట్ పైన చర్చ నడుస్తోంది. మన దేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్‌స్టార్స్‌కే ఎక్కువ గౌరవమర్యాదలు ఇస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. 
 
"ఈ భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవింపబడుతూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. సాధారణ యువతులు దేనిపైనైనా స్పందిస్తే.. వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ, నిందలు వేస్తూ ఉపయోగంలేని వారిగా చూపిస్తూ.. సంబంధంలేని వాటిని వారిపై అంటగడుతున్నారు. అంతా కలిసి అలాంటి యువతుల ఆత్మను, మనస్సును, శరీరాన్ని చంపేసేందుకు సిద్ధమవుతున్నారు" అంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా హీరో పవన్ కళ్యాణ్ అభిమానలకు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్, ఆ తర్వాత కత్తి మహేష్ సంధించిన 6 ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు. ఈ వివాదానికి, నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి ఇందులోకి నన్ను లాగొద్దు, పవన్ కల్యాణ్ గారు దీనిని పరిష్కరించండి అంటూ ట్వీట్ చేసి, ఆ తర్వాత కత్తి మహేష్ వాళ్ల అమ్మపై నెటిజన్ చేసిన ట్వీట్‌ని ఖండిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత దాదాపు ఆమె ఎటువంటి ట్వీట్ చేయలేదు. తాజాగా ఈ విధంగా ట్వీట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చూడండి వీడియోలో...


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Chiranjeevi Pawan Kalyan Kethireddy Jagadiswar Reddy Kathi Mahesh Issue

Loading comments ...

తెలుగు వార్తలు

news

యూపీలో వింత .. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప ...

news

వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మందివున్నారు : సామాజిక కార్యకర్త దేవి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ...

news

వైరముత్తుపై నిత్యానంద శిష్యురాళ్ళ బూతుపురాణం (వీడియో)

ఇటీవల శ్రీవళ్లి దేవతపై సినీ గేయరచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనమయ్యాయి. ఈ ...

news

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై ...

Widgets Magazine