శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (01:08 IST)

అంజన్ కుమార్‌ యాదవ్‌ను చంపేస్తామని బెదిరించిన మొనగాడెవరబ్బా?

సికింద్రాబాద్ నగరంలో టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయులు చేసే హల్‌చల్ చేష్టలు, హంగామా అంతాఇంతా కాదు. అలాంటి అంజన్ కుమార్‌ను ఎవరో చంపేస్తారని బెదిరించారట. ఇంతకీ అలా బెదిరించిన మొనగాడెవరో తనకు తెలియదని, ఆకాశరామన్న ఉత్తరాల తరహాలోనే తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు చేసింది గత నెల 31వ తేదీన. అయితే, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే సందేహాన్ని తీర్చుకోవాడనికి పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని కోర్టు ఈ నెల 5వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఐపిసి సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. 
 
ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది తేల్చడానికి పోలీసులు విచారణ చేపట్టారు. అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయపై ఓడిపోయిన విషయం తెల్సిందే.