Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ పేరుతో మోసం.. పాప పుట్టాక దుబాయ్‌కి జంప్.. ఫోన్ చేస్తే చంపేస్తానన్నాడు..

శుక్రవారం, 19 మే 2017 (16:14 IST)

Widgets Magazine

ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. అమ్మను చేశాడు. పాప పుట్టాక ఆమెను వదిలి దుబాయ్ చక్కేశాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అయితే దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోతు శ్యామల(25) సత్యభాస్కర్‌ ఇంటర్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో స్థానిక ఇంతియాజ్‌ అలీతో పరిచయమైంది. శ్యామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకోకుండా కాపురం చేశాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆపై ఆమెను వదిలించుకునేందుకు దుబాయ్ వెళ్ళిపోయాడు. 
 
దుబాయ్‌ వెళ్లిన తర్వాత కూడా కొంత కాలం ఫోన్‌లో మాట్లాడేవాడు. గత మూడేళ్లుగా ఫోన్‌ చేయకపోవడంతో పాటు తను ఫోన్‌ చేసినా తీయకుండా చంపేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు వాపోతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Kothagudem Man Dubai Cheated Wife Baby Girl

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజనీకాంత్‌కు ఇంగ్లీష్ రాదు.. సీఎంగా పనికిరాడు : సుబ్రమణ్య స్వామి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ...

news

వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ...

news

మిత్రుడిగా భావించిన రజనీకి కృతజ్ఞతలు.. బీజేపీ పట్ల జాగ్రత్త.. రజనీకి స్టాలిన్ సూచన

రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ...

news

పవిత్ర పర్వతంపై ఎక్కింది.. నగ్నంగా ఫోజిచ్చింది.. వివాదంలో చిక్కిన కివీస్ మోడల్..

న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ...

Widgets Magazine