శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: బుధవారం, 30 జులై 2014 (18:47 IST)

గీతా... దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చెయ్... ఎం.ఎల్.ఎ శ్రీవాణి

వైఎస్సాఆర్ సిపిలో మహిళలకు విలువలేదన్న కొత్తపల్లి గీత వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి స్పందించారు. తమకు పార్టీలో మంచి గౌరవమే లభిస్తుందని, గీత తన ఆస్తులు కాపాడుకునేందుకే ఇలాంటి విమర్శలు చేస్తుందని విమర్శించారు.
 
గతంలో జగన్ తోనే అభివృద్ధి అన్న గీతకు ఇంతలోనే చంద్రబాబుతో సాధ్యమని అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీపై విమర్శలు చేసే కంటే పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని ఆమె సవాలు విసిరారు.