శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (12:47 IST)

కృష్ణా పుష్కరాలు 2016: ఆలయాలు, మసీదులున్న చోట టాయ్‌లెట్లా.. బాబు సర్కారుకు ఏమైంది..?

కృష్ణా పుష్కరాలు గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ కృష్ణా పుష్కరాలను అభాసుపాలు క

కృష్ణా పుష్కరాలు గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ కృష్ణా పుష్కరాలను అభాసుపాలు కాకుండా నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇబ్రహీం పట్టణం నుంచి పవిత్ర సంగమం వరకు కిలో మీటర్ మేర శోభాయాత్ర జరుగుతుంది. 
 
ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రచారంతో చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. గోదావరి పుష్కరాలకు అధిక ప్రచారంతో హంగామా చేసిన తెదేపా సర్కారు.. 32 మంది మృతితో షాక్ తింది. అలాంటి అపశృతి జరగకుండా కృష్ణా పుష్కరాలను నిర్వహించేందుకు చంద్రబాబు సర్వం సిద్ధం చేసుకున్నారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగనీయకుండా బయటపడటం బాబుకు పెద్ద పరీక్షగా తయారైంది. కానీ పుష్కరాల ఏర్పాట్ల సమయంలో తెలుగుదేశం పార్టీ ఓవరాక్షన్ చేసిందని స్థానికులు అంటున్నారు. 
 
అనాది కాలం నుంచి పూజలందుకుంటున్న చిన్న చిన్న గుడులను, మసీదులను తొలగించి ఆ ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా టాయ్‌లెట్లు నిర్మించడంపై విపక్షమైన వైకాపా వ్యతిరేకించింది. మరోచోట దివంగత నేత, మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించింది. అంతటితో ఆగకుండా స్వాతంత్ర్యం వచ్చిన  తొలినాళ్ళలో పెట్టిన జాతిపిత గాంధీ బొమ్మను కూడా ప్రభుత్వాధికారులు తొలగించి బుడమేరు కాలువలో గిరాటు వేయించింది. దీంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కలుగజేసుకున్న స్థానిక కలెక్టర్ ఆ విగ్రహానికి బదులు వేరొక విగ్రహాన్ని చేయించి పెడతామని హామీ ఇచ్చారు. 
 
ఇలాంటి చర్యలు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. పుష్కరాల తీరుపై చిన జీయర్ స్వామి కూడా ఘాటుగా స్పందించారు. ఉత్తర భారత్‌లోని ప్రయాగ్, నాశిక్, ఉజ్జయిని వంటి కుంభమేళాల్లో ఎలాంటి రాజకీయాలు జోక్యం చేసుకోవని, కృష్ణపుష్కరాల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.