శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (11:46 IST)

హైదరాబాదులో వైఫై సేవలు: ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.!

హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలో మీటర్లు పరిధిలో వైఫై సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం మారియట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తొలి వీడియోకాల్ మాట్లాడి హైదరాబాద్‌లో వైఫై సేవలను రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
 
ఈ వైపై సేవలను నగర ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలంటే.. 
 
ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?
మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
దీంతో వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది.
మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి. 
మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. 
 
ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా పాస్‌వర్డ్ వస్తుంది
ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది. ఈ వైఫై సేవలను పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్‌బండ్ పరిధిలో 10 కిలోమీటర్ల దూరం వరకు మొదటి ముప్పై నిమిషాల పాటు వైఫై సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 
 
తొలిదశలో భాగంగా పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ అవకాశాన్ని కల్పించారు. రాబోయే రోజుల్లో నగరంలోని 2,000 కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.