శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:03 IST)

దయానిధి మారన్‌ ఫ్యామిలీకి చెందిన రూ.742 కోట్ల ఆస్తులు అటాచ్‌మెంట్!

డీఎంకే నేత, కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో దయానిధి మారన్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.742 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. 
 
ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇప్పటికే ఈడీ దర్యాపు చేస్తోంది. తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో మారన్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది, అంతేగాక, సీబీఐ పలు ఛార్జ్ షీట్ల కూడా దాఖలు చేసింది.
 
అలాగే, బొగ్గు కుంభకోణంలో తెలుగు సినీ దర్శకుడు, కేంద్ర బొగ్గు గనులశాఖ మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకు చెందిన 2.25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈసీ అటాచ్ చేసిన విషయం తెల్సిందే. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవకముందై 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ఈడీ దయానిధి మారన్‌ కుటుంబ సభ్యులకు చెందిన రూ.742 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం.