Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆలి పాలిట కట్టుకున్నవాడే కాలయముడు..

ఆదివారం, 3 డిశెంబరు 2017 (15:51 IST)

Widgets Magazine
murder

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో హతమార్చాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దకబేళా వీధిలో నివసిస్తున్న పర్వీన్‌ను, సున్నంబట్టీ కాలనీవాసి బాషాకిచ్చి నాలుగేళ్ల కిందట పెళ్లి చేశారు. బాషా సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవిస్తున్నాడు. వారికి మూడేళ్ల పాప కూడా ఉంది. పర్వీన్‌ ప్రస్తుతం మూడునెలల గర్భిణి. పెళ్లైనప్పటి నుంచి అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం దంపతులు బెంగళూరు, కేరళ ప్రాంతాలకు వెళ్లగా అక్కడ కూడా వేధింపులు తప్పలేదు. దీంతో తల్లిదండ్రులు బిడ్డను పుట్టింటికి తీసుకొచ్చుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో భార్యతో గొడవపడి గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. 
 
ఆమె అరుపులు విని తల్లిదండ్రులు రావడంతో బాషా అక్కడినుంచి పారిపోయి సంజీవయ్యనగర్‌ శివార్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పర్వీన్‌ను ఎమ్మిగనూరు ఆసుపత్రికి, అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కోలుకోలేక శనివారం కన్నుమూశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనీ బిడ్డను వేడి పెనంపై కూర్చోబెట్టిన తల్లి

తన ప్రియుడితో గుట్టుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనీ కన్నబిడ్డను వేడివేడి ...

news

ప్రచ్ఛన్న యుద్ధం : రష్యా కౌంటర్.. అమెరికా మీడియాపై ఆంక్షలు

ప్రపంచ అగ్రదేశాలైన రష్యా, అమెరికాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. గత కొంతకాలంగా ఈ ...

news

హైదరాబాద్ మెట్రోకు బాంబు బెదిరింపు.. ప్రయాణికుల పరుగోపరుగు

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ...

news

ముగ్గురు భార్యల కామాంధుడు.. కోడలిని రేప్ చేసి బిడ్డకు తండ్రయ్యాడు...

వాడో కామాంధుడు.. ఇప్పటికే ముగ్గురు భార్యలతో పడక సుఖం అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ.. ఆ ...

Widgets Magazine