గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (15:02 IST)

రాజ్యసభ సభ్యుడు కేవీపీపై చర్యలు తప్పవు : స్పీకర్ కోడెల

రాజ్యసభ సభ్యుడు కోడెల శివప్రసాద్‌పై చర్యలు తప్పవని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. అసెంబ్లీ లాంజ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూనే, వైఎస్ ఫొటోను తిరిగి యధాస్థానంలో పెట్టాలని కోరుతూ కేవీపీ ఇటీవల స్పీకర్‌కు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై స్పీకర్ కోడెల స్పందించారు. ఏసీ శాసనసభ, సభాధ్యక్ష స్థానాన్ని కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ లేఖలో అసెంబ్లీతో పాటు స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యానించారని టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ సభా కార్యక్రమాల్లో భాగంగా కేవీపీపై టీడీపీ సభ్యురాలు అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. 
 
దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల, నోటీసును ఎథిక్స్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా కేవీపీపై చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారు. కాగా, అసెంబ్లీ వైఎస్ఆర్ ఫోటో తొలగింపుపై వైకాపా సభ్యులు కూడా ఆందోళన చేసిన విషయం తెల్సిందే.