బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 22 ఆగస్టు 2016 (13:11 IST)

ఒక్క‌డున్నాడురా... అంటూ ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీ

విజ‌య‌వాడ‌: ఏపీని మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తే... ఎదురు తిరిగి ప్ర‌శ్నించే వాడే లేడ‌నుకున్నారా? ఒక్క‌డున్నాడురా... అంటూ ముందుకొచ్చాడో క్రేజీ నాయ‌కుడు... కొంప‌దీసి ఆయ‌న జ‌న‌సేన అధినేత‌... ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుకున్నారా? కాదు... జ‌నాక‌ర్ష‌క నేత ల‌గ‌డ‌పాటి

విజ‌య‌వాడ‌: ఏపీని మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తే... ఎదురు తిరిగి ప్ర‌శ్నించే వాడే లేడ‌నుకున్నారా? ఒక్క‌డున్నాడురా... అంటూ ముందుకొచ్చాడో క్రేజీ నాయ‌కుడు... కొంప‌దీసి ఆయ‌న జ‌న‌సేన అధినేత‌... ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుకున్నారా? కాదు... జ‌నాక‌ర్ష‌క నేత ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి ఇపుడు మ‌ళ్ళీ క‌దం తొక్కుతున్నారు. స‌మ‌స్య‌లే ఎజెండాగా మ‌రోసారి రీఎంట్రీకి ముంద‌డుగు వేస్తున్నారు. 
 
రాష్ట్రం విడిపోయాక... రాజకీయ సన్యాసం తీసుకున్న విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఇటీవల రాజకీయాలు మానుకుని పూర్తి టైం వ్యాపారులకే పరిమితం అయ్యారు. రాజగోపాల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినప్పటి నుంచి కోపానికి గురయిన ఆయన.. మెల్లమెల్లగా ప్రజా సమస్యల పట్ల దృష్టి సారిస్తున్నారు. 
 
ఎవరూ ఊహించని విధంగా అయన విజ‌య‌వాడ‌కు సైలెంట్‌గా వ‌చ్చారు. తారాపేట కబ్రిస్థాన్- మసీదు ప్రాంగణంలో అయన స్థానిక ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. విజయవాడ నగరంలో అభివృద్ధి పేరుతో ఆలయాలు.. దర్గాలు.. మసీదులు.. చర్చిలు ఇష్టానుసారం తొలగిస్తున్న విషయాలను ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్నారు. అహాలే సున్నతుల్జామత్,  ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ , ఎంఐఎం నాయకులు ఇక్క‌డి ప‌రిస్థితిని ల‌గ‌డ‌పాటికి వివరించారు. అన్యాయంగా ప్రార్ధ‌నా స్థ‌లాల‌ను తొలగించార‌ని, ప్ర‌త్యామ్నాయం అడిగితే, కార్యాచ‌ర‌ణ లేద‌ని వివ‌రించారు. అన్నీ విన్న ల‌గ‌డ‌పాటి తాను అండ‌గా ఉంటానని, కొద్ది రోజుల్లో తను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అభయమిచ్చారు.