శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 10 ఆగస్టు 2016 (12:15 IST)

'ఆంధ్రా మిరపకాయ్' రీ-ఎంట్రీ... ఏ పార్టీలోకి...? బాబు బెంబేలు...?

'ఆంధ్రా మిర‌ప‌కాయ్‌'గా పేరు పొందిన లగడపాటి రాజ‌గోపాల్‌ రెడ్డి రాజ‌కీయాల్లో రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా? రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న మ‌రోమారు పోరాటం చేయ‌నున్నారా? తను కొత్త‌గా చేర‌బోయే పార్టీ ఏంట‌న్న సందేహాల‌కు త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుంది. 2014

'ఆంధ్రా మిర‌ప‌కాయ్‌'గా పేరు పొందిన లగడపాటి రాజ‌గోపాల్‌ రెడ్డి రాజ‌కీయాల్లో రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా? రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న మ‌రోమారు పోరాటం చేయ‌నున్నారా? తను కొత్త‌గా చేర‌బోయే పార్టీ ఏంట‌న్న సందేహాల‌కు త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుంది. 2014లో స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాష్ట్ర విభ‌జ‌న‌తో మ‌న‌స్థాపానికి గురై రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. అయితే నాడు పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన నేత‌లు, తెస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన వ్యక్తులు రెండేళ్లు పూర్త‌యినా వాగ్ధానం నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో రాజ‌గోపాల్ మ‌ళ్లీ పోరాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
మొద‌ట్లో టీడీపీలో చేరాల‌ని భావించిన ల‌గ‌డ‌పాటి.. చంద్ర‌బాబు హోదా విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రి త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, దాని మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ హోదా ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్ప‌డంతో ఇక ఆ పార్టీలో చేర‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఒకప్పుడు కాంగ్రెసు పార్టీలో ఉద్దండులంతా.. రాష్ట్రం విడిపోవటం, దివంగ‌త ముఖ్య‌మంత్రి  వైఎస్ చనిపోవటంతో అంతా సరైన ఆదరణ లేక ఇంటిదారి పట్టారు. చాలామంది నాయకులు ఏపీలో ఎంత రాజకీయ రాద్దాంత జరుగుతున్నా బయటకి రాలేదు. 
 
కానీ ఈమధ్య.. వైఎస్ ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలు నేడు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు. ప్రజల పక్షాన, ప్రతిపక్షం వైపు మాట్లాడుతున్నారు. అందులో ఉండవల్లి మొదటి వరుసలో ఉంటే.. రీసెంట్‌గా లగడపాటి ఉన్నారు. తను గ‌తంలో విజ‌య‌వాడ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హం టీడీపీ స‌ర్కార్ తొల‌గించ‌డంతో ల‌గ‌డ‌పాటి మౌనం వీడారు. 
 
ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇప్పుడు వ‌యొలెంట్‌గా మాట్లాడ‌టం వెన‌క పెద్ద స్కెచ్ ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.. వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ల‌గ‌డ‌పాటి పావులు క‌దుపుతున్నాడ‌ట‌. ఇందుకు జ‌గ‌న్ అనుగ్ర‌హం పొందిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళిన జగన్ తిరిగి రాగానే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు చ‌క‌చ‌క ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు ల‌గ‌డ‌పాటి అనుచ‌రులు పేర్కొంటున్నారు. లగడపాటి చేరికతో విజయవాడలో చంద్రబాబుకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.