జగన్ ఎన్నికలకే ఖర్చు పెట్టడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం..?: లక్ష్మీపార్వతి

గురువారం, 12 అక్టోబరు 2017 (15:16 IST)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే తీస్తుందని వస్తున్న వార్తలను లక్ష్మీపార్వతీ కొట్టిపారేశారు. జగన్ మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ ఈ చిత్రాన్ని జగన్ తీయిస్తున్నాడని అనరన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అలా అనదు. 
 
ఎందుకంటే.. జగన్ ఎన్నికలకే ఖర్చుపెట్టడని.. వైకాపాలో చాలామంది బాధపడుతుంటామన్నారు. అట్లాంటిది, ఓ లక్ష్మీపార్వతి కోసం, ఎన్టీఆర్ కోసం జగన్ సినిమా తీస్తాడని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. అలా ఖర్చు పెట్టి వుంటే గత ఎన్నికల్లోనే గెలిచి అధికారం కైవసం చేసుకునే వాడని లక్ష్మీపార్వతి అన్నారు.
 
మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి తెదేపా మంత్రి సోమిరెడ్డికి.. ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాటల యుద్ధం జరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలివితేటలు ఏమైనా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సక్సెస్‌పై చూపించమంటూ సోమిరెడ్డి చేసిన కామెంట్స్‌కు వర్మ బదులిచ్చారు. వావ్ ఏం జీనియస్ సార్ మీరు అన్నారు. సోమి సార్ చెప్పేదాకా తనకు ఆ విషయమే తట్టలేదన్నారు. సోమి టీచర్ గారు, గొప్ప పాఠం చెప్పారు. ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలో చెప్పండంటూ సెటైర్ విసిరాడు. దీంతో సోమికి దిమ్మదిరిగినట్లైంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేరా బాబా పీఏ రాకేష్, న్యాయసలహాదారుకు వృషణాలు లేవు.. సీబీఐ షాక్

డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు జీవితం ...

news

సోమిరెడ్డికి చుక్కలు చూపించిన వర్మ.. హీరోయిన్లు గౌరవానికి అనర్హులా? తెలిస్తే ఉరేసుకుంటావ్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి ...

news

భర్తను పిజ్జా కొనివ్వమంది.. పెళ్లైన రెండో రోజే చెక్కేసింది..

భర్తను పిజ్జా కొనివ్వమని అడిగింది.. షాపులోంచి బయటకొచ్చేసిరికి చెక్కేసింది. పెళ్లైన ...

news

జై షాను వెనుకేసుకొస్తున్నారంటే తప్పు జరిగినట్టే : యశ్వంత్ సిన్హా

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ...