గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (11:34 IST)

ఆయనో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ... కానీ 85 యేళ్ళ వృద్ధ తల్లి పేరుతో అక్రమాలు...

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ భూ అక్రమాల ఆరోపణల్లో చిక్కుకున్నారు. 85 యేళ్ళ వృద్ధురాలైన తల్లి పేరుతో ఈ భూ అక్రమాలకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ భూ అక్రమాల ఆరోపణల్లో చిక్కుకున్నారు. 85 యేళ్ళ వృద్ధురాలైన తల్లి పేరుతో ఈ భూ అక్రమాలకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్ణాటక చీఫ్ సెక్రటరీ అరవింద్ జాదవ్ పని చేస్తున్నారు. 85 సంవత్సరాల తన తల్లి తారాబాయ్ తారాబాయ్ మారుతీరావ్ జాదవ్‌ను సర్టిఫైడ్ రియల్టర్‌గా సృష్టించి, ప్రభుత్వానికి చెందిన 8.2 ఎకరాల విలువైన భూమిని ఆమె పేరిట రిజిస్టర్ చేయించడంతో పాటు, హెగ్గనహళ్ళి గ్రామ సమీపంలో 16 ఎకరాల్లో లేఔట్లు గీసి వ్యాపారం సాగిస్తున్నట్టు ఈయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 
 
ఆయన తల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే శక్తి సామర్థ్యాలు లేవని, అరవింద్ అక్రమాలకు తెరలేపాడని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అరవింద్ భూ దందాపై దినపత్రికలు ప్రచురిస్తూ, ఆయన లేఔట్లకు సంబంధించిన పత్రాలను తాము సేకరించామని పేర్కొంది. వీటిని అరవింద్ జాదవ్ ఖండించారు.