బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (14:12 IST)

చిరుత సాగర్‌లో ఈదుకుంటూ నాగార్జున కొండపైకి వచ్చేస్తుందేమో... జాగ్రత్త

ఈమధ్య కాలంలో అరణ్యంలో ఉండాల్సిన క్రూర జంతువులు మెల్లమెల్లగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పాపం వాటికి అక్కడ సౌకర్యవంతంగా లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని వన్యప్రాణ సంరక్షకులు అంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అడవుల నరికివేత వేగంగా జరుగుతోంది. దీంతో అడవుల్లో ఉండాల్సిన ప్రాణులు భయంతో ఎటంటే అటు వచ్చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నాగార్జున కొండపైకి చిరుతపులి వచ్చిందంటూ వదంతలు వచ్చాయి. 
 
దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు వెంటనే అక్కడికి వెళ్లారు. సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదనీ, ఐతే చిరుత తెలంగాణ వైపునున్న రేగులవరం నుంచి 2 నుంచి 3 కి.మీ మేర నీటిలో ఈదుకుంటూ వచ్చే ఆస్కారం లేకపోలేదని వెల్లడించారు. ఇప్పటికైతే నాగార్జున కొండపైన అడవి పందులు సంచరిస్తున్నట్లు కనుగొన్నామన్నారు. చిరుత కూడా ఇక్కడకి వచ్చే అవకాశం ఉన్నది కనుక కొండపైన విధులు నిర్వర్తించేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.