శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (10:47 IST)

తెలంగాణా రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు.. మరి హైదరాబాద్ పరిస్థితేంటి?

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎప్, ఆర్మీ బలగాలు రంగంలోకి సహ

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎప్, ఆర్మీ బలగాలు రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నీటి కుండల్లా కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పుష్కలంగా వస్తుండటంతో కిందికి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విదర్భ, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లపై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఈ కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.