శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (17:00 IST)

కోపంతో కాలేయానికి దెబ్బ: ఆరోగ్య సమస్యలు తప్పవ్!

కోపం ఎక్కువైతే తగ్గించుకోండి. అప్పుడప్పుడు కోపం పడటం ద్వారా కాలేయానికి దెబ్బని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, గోళ్లలో ఇన్ఫెక్షన్లు వంటివి టెన్షన్ పడటం ద్వారా తప్పవంటున్నారు నిపుణులు.
 
మానసిక ఒత్తిడి, అధిక కోపం, అధిక శారీరక శ్రమ, మద్యపాన సేవనం, మత్తు మందులకు బానిస కావడం, నిద్రలేమి, హై ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటివి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా రక్తపోటు, తలనొప్పి, హృద్రోగ సమస్యలు, పచ్చకామెర్లు, కడుపునొప్పి, మతిమరుపు, పక్కవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి.  
 
కాలేయం దెబ్బతినకుండా ఉండాలంటే ఆహార పదార్థాల్లో మార్పు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను తీసుకోకూడదు. తాజా కూరగాలు, వారానికోసారి నాన్ వెజ్ తీసుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.