బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (10:54 IST)

నేను ఎంపిగా నిలబడితే నాకెవరు ఓటేస్తారు : జయప్రకాష్ నారాయణ్

వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తే తనకు ఎవరు ఓటేస్తారనీ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ప్రశ్నించారు. ఆయన లోక్‌సత్తా పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి చివరకు భంగపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తే తనకు ఎవరు ఓటేస్తారనీ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ప్రశ్నించారు. ఆయన లోక్‌సత్తా పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి చివరకు భంగపడ్డారు. 
 
ఈ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో తన పార్టీ ప్రజలకోసమేగాని ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయదని కూడా ప్రకటన చేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ ఏపీలో నెలకొన్న సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వచ్చారు. 
 
ఇటీవల ఏపీ హక్కుల సాధనలో భాగంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. పవన్ సూచన మేరకు కమిటీలో పాల్గొని తన సలహాలు, సూచనలు ఇచ్చారు. 
 
అయితే, పవన్, జేపీల మధ్య ఇప్పటికే ఓ అవగాహన కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి జయప్రకాష్‌ పోటీ చేయమని పవన్ కళ్యాణే స్వయంగా కోరారట. ప్రజల సమస్యలను బాగా తెలిసిన వ్యక్తి.. అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే అన్న విధానంతో ముందుకు వెళుతున్న వ్యక్తులో జయప్రకాష్‌ నారాయణ్ ఒకరు కావడంతో ఆయనంటే పవన్‌కు ఎంతో ఇష్టం.
 
అందుకే ఎంపీగా పోటీకి జయప్రకాష్‌‌ను ఓకే చేశారు. కానీ జయప్రకాష్ నారాయణ్‌‌కు మాత్రం పోటీ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేదని ఆయనే స్వయంగా చెబుతున్నారు. నేను ఎంపిగా నిలబడితే నాకెవరు ఓటేస్తారు.. అంటూ తన మనస్సులోని మాటను ఆయన తేటతెల్లం చేశారట. కానీ, పవన్ మాత్రం జేపీని బరిలోకి దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.