మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం... బతకనివ్వరు మీరు... అందుకే ఇదే ఆఖరి సెల్ఫీ...

couple
జె| Last Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)
చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ జంట చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో వారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చనిపోయే ముందు సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
couple

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన రెండు వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పగా, వారు పెళ్లికి అంగీకరించలేదు.
couple

దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చనిపోయే ముందు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయారు. ఈ సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :