గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:31 IST)

కాబోయే భర్తనే కదా.. అంటూ కోర్కె తీర్చుకుని... 'నీకు దిక్కున్నచోట చెప్పుకో' అంటూ మోసగించిన ప్రియుడు

ఓ కామాంధుడు చేతిలో మరో మైనర్ బాలిక మోసపోయింది. ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా వాడుకున్నాడు. అవసరం తీరాక నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ బెదిరింపులకు దిగాడు.

ఓ కామాంధుడు చేతిలో మరో మైనర్ బాలిక మోసపోయింది. ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా వాడుకున్నాడు. అవసరం తీరాక నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ బెదిరింపులకు దిగాడు. విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగిన ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గాజువాక సమీపంలోని యాతపాలేనికి చెందిన వరలక్ష్మి టీ కొట్టు నిర్వహిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తోంది. తుని సమీపంలోని మల్లివరానికి చెందిన చుక్కా పెద్దన్న (22) పెదగంట్యాడ సత్యనారాయణపురంలో గది అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. స్థానికంగా ఉండే ఓ రవాణా సంస్థలో క్లీనర్‌గా చేస్తున్నాడు. తరచూ వరలక్ష్మి టీ కొట్టుకు వస్తూ ఆమె కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో ప్రేమ.. పెళ్లి అంటూ మాయమాటలు చెప్పడమే కాదు.. కాబోయే భర్తను కదా అంటూ చేరువయ్యాడు. ఆరు నెలల పరిచయంలో శారీరకంగా లొంగదీసుకున్నాడు. అలా ఇంట్లో ఇద్దరిని పట్టుకున్న స్థానికులు, పెద్దన్న తల్లిదండ్రులను, గ్రామపెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టారు. 
 
ప్రస్తుతానికి బాలిక మైనర్‌ కనుక మేజర్‌ కాగానే వివాహం చేసుకుంటాడని వారు హామీ ఇచ్చారు. కానీ లిఖిత పూర్వకంగా పత్రాలు రాసుకోలేదు. అప్పటి నుంచి బాలిక ఇంటికి రాకపోకలు సాగిస్తున్న పెద్దన్న కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి వెళ్లిపోయి, మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేశాడు. 
 
దీంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబం తుని వెళ్లి పెద్దన్నను కలిసింది. తాను పెళ్లి చేసుకోనని, దిక్కున్నచోట చెప్పుకొమ్మని తెగేసి చెప్పాడు. తల్లిదండ్రులను నిలదీసినా.. అదే సమాధానం వచ్చింది. పైగా బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. 'నీ కూతురు నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. పెళ్లి కోసం ఒత్తిడి చేస్తే.. వాటిని పోస్టర్లు వేసి ఊరంతా అంటిస్తాను.' అంటూ అతను హెచ్చరించడంతో ఆ కుటుంబం పరువు పోతుందని తిరిగి విశాఖ చేరుకుంది. 
 
స్థానికుల సలహా మేరకు వరలక్ష్మి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. ఇటువంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని, తన కుమార్తెతో వివాహం జరిపించాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఆ తల్లి డిమాండ్‌ చేస్తోంది.