Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమలో ఓడిపోయాం.. పురుగుల మందు తాగి చనిపోతున్నాం.. కృష్ణగిరిగుట్టపై?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:00 IST)

Widgets Magazine

ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాము ప్రేమలో ఓడిపోయామంటూ ఆ జంట మనస్తాపానికి గురైంది. దీంతో పురుగుల మందు తాగి ఆ జంట ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల సమీపాన సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ యువతి (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.
 
మధు రిమాండ్‌కు వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన మల్లేష్ (వరుసకు బావ)తో యువతికి పెళ్లిచేసి, పిట్టలగూడలోనే కాపురం పెట్టారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనంచేసి నిద్రించిన యువతి... ఆదివారం తెల్లారేసరికి కనిపించలేదు. దీంతో మధుపై అనుమానం వ్యక్తంచేస్తూ యువతి కుటుంబ సభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరిద్దరి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దుద్యాల సమీపంలోని కృష్ణగిరిగుట్టపై కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తాము పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫోనులో మధు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ వెన్నులో వణుకు.. రాత్రంతా ఎమ్మెల్యేలతో గడిపిన చిన్నమ్మ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే.శశికళ ...

news

టైంబాంబును తలపిస్తున్న తమిళనాడు... కూవత్తూరులోనే శశికళ

అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు ...

news

దేవుడా ఈ రోజు మాత్రం నాది కానివ్వు... పన్నీర్, శశికళ జాగారపు వేడికోలు

హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడనంత టెన్షన్‌ ప్రస్తుతం ఆ ఇద్దరినీ ఆవహించింది. జయలలిత మరణించిన ...

news

ఎమ్మెల్యేల చుట్టూ 600 మంది పోలీసులు: 20వేల పోలీసుల మోహరింపు

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తమిళనాడు నిరువుగప్పిన నిప్పులా ఉంది. మంగళవారం ఉదయం 11 గంటల ...

Widgets Magazine