శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (11:59 IST)

'మా' పెద్దల తీరు ఏమాత్రం బాగోలేదు : సినీ నటి రోజా

మూవీ ఆర్టిస్ట్ అసియేషన్‌లో పెద్దలమని చెప్పుకునే కొందరు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం జరుగుతున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తీరు బాధను కలిగించిందన్నారు. పెద్దలంతా ఓచోట కూర్చుని 'మా' అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుండేదని అన్నారు. 
 
ఎవరో పెద్దలు తమ స్వార్థంతో నటీనటుల మధ్య చిచ్చు పెట్టారని ఆమె విమర్శించారు. పోటీ ఉండడంవల్ల ఎవరు ఏం చేస్తామన్న విషయాన్ని ముందే చెప్పారని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని అన్నారు.