చిత్తూరుకు కత్తి... గృహంలోనే పరిపూర్ణానంద స్వామి

శ్రీరాముడుని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యానించి కోట్లాది మంది హిందువుల మనోభాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆరు నెలల నిషేధం విధించారు. ఒక వేళ తమ నిషేధాజ్ఞలు ఉల్ల

kathi mahesh
pnr| Last Updated: మంగళవారం, 10 జులై 2018 (13:05 IST)
శ్రీరాముడుని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యానించి కోట్లాది మంది హిందువుల మనోభాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆరు నెలల నిషేధం విధించారు. ఒక వేళ తమ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి హైదరాబాద్‌లో అడుగుపెడితే మాత్రం మూడేళ్ళ జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. అదేసమయంలో కత్తి మహేష్‌ను ఆయన సొంతూరు అయిన చిత్తూరుకు తరలించారు.
 
ఇకపోతే, కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భంధంలో ఉంచారు. రెండో రోజు అయిన మంగళవారం కూడా ఆయన్ను ఇంటికే పరిమితం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే నిరాహారదీక్షకు దిగడంతో ఆయనతో పాటు.. మరో 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. .
 
మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్‌పీ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది. దీనిపై మరింత చదవండి :