శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 మే 2016 (10:52 IST)

నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములవుతాం : మలేషియా మంత్రి మహ్మద్

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని మలేషియా మంత్రి ముస్తఫా మహ్మద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు, సహకరించేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మహ్మద్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలు ఉన్నాయని, ఖనిజ సంపదకు కొదవ లేదన్నారు. రాష్ట్రాన్ని తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీసిటీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని... ఇక్కడ ఇప్పటికే 26 దేశాలు తమ పరిశ్రమలు నెలకొల్పినట్లు తెలిపారు.