గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (20:11 IST)

నెల్లూరు చేరిన మల్లి మస్తాన్ బాబు మృతదేహం.. ప్రముఖుల నివాళి

ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు ఆయన స్వగ్రామమైన గాంధీ జనసంఘానికి చేరుకుంది. చెన్నై నుంచి రోడ్డు మార్గాన ఆయన మృతదేహాన్ని అధికారులు నెల్లూరు జిల్లాకు చేర్చారు. ఆయన మృతదేహానికి అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం ప్రముఖు ఆయనకు నివాళులు అర్పించారు. 
 
సామాన్య ప్రజలు మస్తాన్ బాబు ఇంటికి వెల్లువెత్తారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు తదితరులు శుక్రవారం సాయంత్రమే వెళ్లి మస్తాన్బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. అర్జెంటీనాలోని పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రమాదవశాత్తు మంచులో కూరుకుపోయి మస్తాన్బాబు మరణించిన విషయం తెలిసిందే. 
 
ఆయన మృతదేహాన్ని బయటకు తీసేందుకు అర్జెంటీనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత సాధ్యం కాకపోయినా.. తర్వాత జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి వెంటనే భారతదేశానికి పంపారు. చెన్నై విమానాశ్రయం నుంచి సంగం మండలంలోని గాంధీ జనసంఘానికి మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు.