శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (15:54 IST)

చెత్తకుండీలో లక్షరూపాయలు దొరికితే.. మీరేం చేస్తారు?

లక్ష రూపాయలు చేతికి చిక్కితే దాచేసుకునే వారు కొందరుంటారు. కానీ పరాయి సొమ్ము పాముతో సమానమని భావించిన ఓ నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు దొరికిన లక్ష రూపాయలను ఆ డబ్బుకు సొంతమైన యజమాని చేతిలో పెట్టేసింది

లక్ష రూపాయలు చేతికి చిక్కితే దాచేసుకునే వారు కొందరుంటారు. కానీ పరాయి సొమ్ము పాముతో సమానమని భావించిన ఓ నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు దొరికిన లక్ష రూపాయలను ఆ డబ్బుకు సొంతమైన యజమాని చేతిలో పెట్టేసింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, మెట్ పల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో జావేద్ చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
ఇతడు గత రాత్రి దుకాణం బంద్ చేసే సమయంలో ఓ చేతిలో చెత్త కవర్‌ని పట్టుకెళ్లాడు. చెత్తకుండీలో చెత్త కవరుకు బదులు.. డబ్బు కవర్‌ని విసిరేశాడు. చూసుకోకుండా ఇంటికెళ్లిపోయాడు. ఉదయం లేచి డబ్బుల కోసం కవర్ తెరిస్తే.. అందులో చెత్త ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే బైకు తీసుకుని చెత్త కుండీ వద్దకెళ్లి వెతకడం ప్రారంభించాడు. 
 
దాన్ని చూసిన పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మి డబ్బు కోసం వెతుకుతున్నాడని ఆరాతీసింది. ఆ డబ్బును తానే తీసిపెట్టానని చెప్పింది. దాచిన డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఆమె నిజాయితీకి మెచ్చుకున్నారు. ఇంకా జావేద్ ఆమెకు నజరానాగా ఐదు వేల రూపాయలు అందజేశాడు.