గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (11:59 IST)

కూతురినిచ్చి పెళ్లిచేయలేదని మేనత్తపై కత్తితో దాడి!

కూతురినిచ్చి పెళ్లిచేయలేదని మేనత్తపైనే ఓ ప్రబుద్ధుడు దాడికి పాల్పడ్డాడు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమని కొద్దికాలంగా  అడుగుతూనే ఉన్నాడు. అయితే, అందుకు ఆమె ససేమిరా అంది. కూతురికి వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. దీంతో, ఆగ్రహం పట్టలేకపోయిన మేనల్లుడు గురువారం ఉదయం మేనత్త ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. 
 
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాలపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు రక్తపు మడుగులో కుప్పకూలగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.