పెళ్లి పేరిట మైనర్ బాలిక మోసం.. లోబరుచుకుని గర్భవతిని చేశాడు.. శీలం ధర రూ.2.5 లక్షలు

పెళ్లి పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. న్యాయం కోసం పోరాడితే.. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్

rape girl
selvi| Last Updated: శనివారం, 11 ఆగస్టు 2018 (14:29 IST)
పెళ్లి పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ గర్భం దాల్చింది. న్యాయం కోసం పోరాడితే.. గ్రామ పెద్దలు  పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకుంది. 
 
ఆగస్టు ఒకటో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడితో పాటు నలుగురు పంచాయతీ పెద్దలను అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. 17ఏళ్ల బాలిక వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తోంది. పత్తి పొలాల్లో పనిచేస్తున్న ఆ బాలికను పొలం యజమాని వెంకటయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక శరీరంలో మార్పులు రావడంతో తల్లి గుర్తు పట్టి ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. దాంతో విషయం బయటపడింది.దీనిపై మరింత చదవండి :