అమ్మ పిలిచిందని తీసుకెళ్లి 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:19 IST)

పిలిచిందని తీసుకెళ్లాడు. 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  కొమరోలు మండలం చినగానిపల్లె గ్రామంలోని ఓ (13)పై అదే గ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. 
 
అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు ఇంటి వద్దే వున్న బాలికపై రంగ స్వామి కన్నేశాడు. అంతే శనివారం ఒంటరిగా వున్న బాలిక వద్దకు వెళ్లిన ఆ కామాంధుడు.. అమ్మ పిలుస్తుందని చెప్పి.. గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై బాలిక తల్లి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు సీఐ శ్రీ రామ్‌ గ్రామానికి వెళ్లి విచారించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు గిద్దలూరు సీఐ తెలిపారు. 

విమానంలో ఓవర్ లోడ్... కుప్పకూలి 19 మంది మృతి

ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే ...

'లంచం' రూపంలో 'మంచం' కోరినా నేరమే...

అవినీతి నిరోధక చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. లంచం రూపంలో డబ్బులకు మంచం (పడక సుఖం) ...

ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే వైకాపా... : సబ్బం హరి జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైకాపా అడ్రస్ ...

పాలు పితికి ఆ పాలతోనే పాలాభిషేకం చేయించుకున్న ఎంపి(ఫోటోలు)

దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ...