Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏమండీ.. మీ నాన్న అత్యాచారం చేశాడు.. భార్య :: నీకు మామే కదా... సర్దుకుపోవే.. భర్త

గురువారం, 6 జులై 2017 (08:46 IST)

Widgets Magazine
rape

సభ్యసమాజం తలదించుకునే చర్య. మానవ సంబంధాలకు మాయని మచ్చ. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ చర్యను తీవ్రంగా ఖండించాల్సిన భర్త.. నీకు మామే కదా.. సర్దుకుపోవే.. ఆయన చెప్పినట్టు నడుచుకో అంటూ సమర్థించాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో దిక్కుతోచక... పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణం విజయవాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విజయవాడ, కృష్ణలంకలో నివసించే ఒక మహిళ (32)కు సూర్యారావుపేట బోయపాటి వారి వీధికి చెందిన లక్ష్మీశ్రీనివాస్‌ (40) అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌ అనుమానంతో వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. భర్త వేధింపులకు మామ ప్రసాద్‌ కూడా తోడయ్యాడు. దీంతో ఆ వివాహిత మానసికంగా కుంగిపోయింది. 
 
ఈక్రమంలో మూడేళ్ల క్రితం అత్త మృతి చెందడంతో మామ ప్రసాద్‌ కోడలిపై కన్నేసి ఆమెను లొంగ దీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ, ఆమె అతని ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. అయితే, గత ఏడాది నవంబర్‌ మొదటి వారంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా అతను కూడా తన తండ్రి చెప్పినట్లు వినాలని, సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఆమె పిల్లలతో పుట్టింటికి చేరింది. 
 
భార్య పుట్టింటికి వెళ్లడంతో మరింతగా ఆగ్రహం చెందిన శ్రీనివాస్.. భార్యవద్దకు వెళ్లి అక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు బుధవారం కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాలకుడి గుండె చెమర్చిన వేళ.. ప్రసన్నకు బాబు అభయహస్తం

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహిరంగంగా తొలిసారిగా కంట తడిపెట్టిన పాలకుడాయన. కన్నతండ్రి ...

news

సంబంధం పెట్టుకుని మధ్యలో వద్దంటావా.. వెయ్.. పొడిచేశాడు

రక్తం మరిగిన పులి వేట మానుతుందా.. వివాహేతర సంబంధాన్ని రుచిచూసిన మగాడు మధ్యలో వద్దు పోవోయ్ ...

news

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు చంద్రబాబు 20 లక్షల సహాయం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్య, కూతుళ్ళను దారుణంగా హత్య చేసిన నిందితుడు ...

news

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో మోదీ బస

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ...

Widgets Magazine