Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్యూటీకని వెళ్లి మామిడితోటలో శవమై తేలాడు... ఎలా?

సోమవారం, 26 జూన్ 2017 (15:08 IST)

Widgets Magazine
murder

విధులకు వెళుతున్నట్టు చెప్పి మామిడి తోటలోకి వెళ్లిన ఓ వ్యక్తి చివరకు శవమై తేలాడు. ఓ మహిళతో సాగిస్తున్న వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం జిల్లా జైపూర్ మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జైపూర్ మండల పరిధిలోని దుబ్బపల్లికి చెందిన రాంటెంకి క్రిష్ణ(32) అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు కావ్య అలియాస్‌ పద్మ ఉంది. అదేసమయంలో ఓ మహిళతోనూ వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో భర్త ప్రవర్తన నచ్చని పద్మ.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి భార్యాభర్తలను కలిపారు. 
 
ఈ కారణంగా క్రిష్ణ ప్రవర్తనను వ్యతిరేకిస్తూ భార్య కావ్య అలియాస్‌ పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై కులపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. కుటుంబ సభ్యులు, కులపెద్దల సూచనల మేరకు కొంతకాలంగా భార్య కావ్యతో కలిసి సోమగూడెం కాసిపేటలో నివాసముంటున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న క్రిష్ణ శుక్రవారం డ్యూటికి వెళ్లి 
 
శనివారం రాత్రి డ్యూటీకని చెప్పి వెళ్లిన క్రిష్ణ... సోమగూడెం కాసిపేట్‌కు వెళ్లాల్సివుండగా నేరుగా దుబ్బపల్లికి చేరుకున్నాడు. అక్కడ నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో లారీ యార్డ్‌లోనే పడుకుంటున్నట్లు భార్య కావ్యకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. అనంతరం దుబ్బపల్లికి చేరుకుని గతంలో వివాహేతర సంబంధం కలిగివున్న మహిళ ఇంటికి వెళ్లి హత్యకు గురై ఉంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానిస్తున్నారు. డ్యూటీ నుంచి వచ్చిన క్రిష్ణను పథకం ప్రకారమే హత్య చేసి మామిడి తోటలో పడవేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గర్భంతో విద్యాలయాలకు రావడానికి వీల్లేదట... అధ్యక్షుడి ఆదేశం

ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి ...

news

అక్రమ సంబంధం వీడియో... ఆ తెలంగాణ నాయకుడిని పిచ్చివాడిని చేస్తోందా?

ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో ...

news

వివాహేతర సంబంధం వద్దన్నదనీ... చెల్లి భర్త ఏం చేశాడో తెలుసా?

భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య ...

news

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. ...

Widgets Magazine