గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (11:18 IST)

ప్రియుడితో లేచిపోయినా తెచ్చుకున్న భర్త... తలదించుకునే పని చేసింది...

బంగారం లాంటి భర్త. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు. హాయిగా సాగుతున్న కాపురంలో ఆ ఇల్లాలు తప్పటడుగు వేసింది. దీంతో వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రియుడి మోజులో పడి ఇంటి గడప దాటిన ఆ ఇల్లాలికి ఇబ్బంద

బంగారం లాంటి భర్త. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు. హాయిగా సాగుతున్న కాపురంలో ఆ ఇల్లాలు తప్పటడుగు వేసింది. దీంతో వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రియుడి మోజులో పడి ఇంటి గడప దాటిన ఆ ఇల్లాలికి ఇబ్బందులే మిగిలాయి. పిల్లలు అనాథలయ్యారు. నచ్చినవాడితో బయటకు వెళ్లిన పాపానికి.. డబ్బులు ఖర్చయ్యాయి.

సొమ్ములుంటేనే సహజీవనం అంటూ ప్రియుడు ముఖం చాటేయడంతో.. ఇంటికి రాలేక హాస్టల్‌లో చేరింది. అంతటితో ఆగకుండా మహిళల పర్సులు, బంగాలు గొలుసు కొట్టేస్తూ దొంగగా మారిపోయంది. చివరికి పోలీసులకు చిక్కింది. ఇలా భర్త, పిల్లల్ని కాదనుకుని ప్రియుడితో అందమైన లోకం లభిస్తుందనుకున్న ఆ మహిళకు జైలే మిగిలింది. 
 
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌కు కె.పద్మ(29) కాలేజీ విద్య పూర్తిచేసింది. పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. సరదాలకు అలవాటు పడింది. పిల్లల్ని వదిలేసి ప్రియుడితో షికార్లుకు వెళ్ళేది. భర్త హెచ్చరించడంతో అతనని కాదనుకుంది. అమ్మా అంటూ పిల్లలు వెంటపడినా విదిలించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆపై  ప్రియుడు కె.పవన్‌కుమార్‌ (23)తో సహజీవనం చేయాలనుకుంది. కానీ పద్మను దిల్‌సుఖ్‌నగర్‌ గడ్డిఅన్నారంలో మానస ప్రగతి ఉమెన్స్‌ హాస్టల్‌లో స్టూడెంట్‌గా చేర్పించాడు.
 
ఇంట్లో నుంచి తీసుకొచ్చిన రూ.40 వేలు ఖర్చయ్యాయి. తినేందుకు.. హాస్టల్‌ అద్దె చెల్లించేందుకు డబ్బులేదు. ఇక ప్రియుడే ఆమెను దొంగగా మార్చేశాడు. ఇందులో భాగంగా బంగారు గొలుసులు, సెల్ ఫోన్లు, డబ్బుల్ని దొంగలించేది. బాధితులు వార్డెన్‌ ద్వారా మలక్‌పేట పీఎస్‌లో పద్మపై ఫిర్యాదు చేశారు. నిఘా వుంచిన పోలీసులు పక్కా ఆధారాలతో పద్మను, పవన్‌కుమార్‌ను క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జైలుకు పంపారు.