మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (22:13 IST)

మరో 33 రోజుల్లో మన మంగళ్ యాన్ అరుణగ్రహంపై అడుగు

మంగళ్ యాన్( మార్స్ ఆర్బిటర్ మిషన్) మరో 33 రోజుల్లో అరుణ గ్రహంపై అడుగు పెట్టబోతోంది. దీనితో ప్రపంచ అగ్ర దేశాల సరసన భారతదేశం చోటు దక్కించుకోబోతోంది. ఇస్రో తన ఫేస్ బుక్ లో మంగళ్ యాన్ గురించి తెలుపుతూ... మరో 33 రోజుల్లో మంగళ్ యాన్ అరుణ గ్రహంపై అడుగిడబోతోంది. అరుణ గ్రహానికి మంగళ్ యాన్ కేవలం 90 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంది. అలాగే భూమి నుంచి 189 మిలియన్ కిలో మీటర్ల దూరానికి వెళ్లిపోయింది అని తెలిపింది.
 
కాగా మంగళ్ యాన్ ఇస్రో నవంబర్ 2013లో ప్రయోగించింది. మంగళ్ యాన్ అరుణ గ్రహంపై సెప్టెంబరు 24న సరిగ్గా ఉదయం 7.30 నిమిషాలకు చేరుతుంది. ఐతే ఇది చాలా కీలకమైన దశ అని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. సెప్టెంబరు 14న అంటే, అరుణ గ్రహానికి చేరుకునే 10 రోజుల ముందు మంగళ్ యాన్ లో చిన్న కరెక్షన్ చేయాల్సి ఉంటుంది.