Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాంసం కొంటున్నారా? కనీస శుభ్రత పాటించట్లేదు.. జరజాగ్రత్త..

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:33 IST)

Widgets Magazine
red meat

మాంసం కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. మాంసం అమ్మకాల్లో చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అధికారులు అంటున్నారు. వ్యాపారులు కోసే పొట్టేళ్లు, మేకలు, కోళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని పట్టించుకోవట్లేదంటున్నారు. మాంసానికి ఉపయోగించే పొట్టేళ్లు, మేకలపై అధికారులు పరీక్షించినందుకు గుర్తింపుగా సీలు వేసేవారు. ఇది మున్సిపాలిటీ, పంచాయతీల్లో కొనసాగే పద్ధతి. కానీ ప్రస్తుతం పులివెందులలో ఇలాంటి పరిస్థితి కనిపించట్లేదు. 
 
పులివెందుల పట్టణంలో చికెన్, మటన్ అమ్మకాల్లో మోసం జరుగుతోంది. అనారోగ్యం, చనిపోయిన, ప్రమాదవశాత్తు మృతి చెందిన గొర్రెలు, మేకలు, కోళ్లను గుట్టుచప్పుడు కాకుండా కోసి మాంసంగా విక్రయించేస్తున్నారు. అత్యాశకు పోయిన వ్యాపారులు, దళారులతో కలిసి వీటిని తక్కువ ధరకు కొని తగురీతిలో భద్రపరిచి తాజా మాంసంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనారోగ్యంతో మరణించే జీవుల మాంసం తినడంతో అనారోగ్యం ఏర్పడుతుందని మాంసం ప్రియులు వాపోతున్నారు. అసలు జీవాలను కోసే క్రమంలో మున్సిపల్‌, పశువైద్యా ధికారుల ధృవీకరణ కానరావడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
 
కాసులే లక్ష్యంగా వ్యాపారులు మాంసాహార ప్రియులను దోచుకుంటున్నారు. ధరలు కూడా బాగా పెంచేస్తున్నారు. నాటుకోడి పేరుతో లేయర్‌ విక్రయాలు చికెన్ విషయానికొస్తే నాటుకోడి అంటూ లేయర్‌ కోళ్లను అంటగడుతున్నారని బహిరంగ విమర్శలున్నాయి. కోళ్లను రవాణా చేసే సమయంలో చనిపోయిన కోళ్లను, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు, చికెన పకోడి బండ్లకు, చిరుహోటళ్లకు అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 
 
ఇది తెలియక ప్రజలు వ్యాపారుల చేతుల్లో గుడ్డిగా మోసపోతున్నారు. రోడ్డు పక్కనే అమ్మే మాంసం విషయంలో శుభ్రత పూర్తిగా లోపించింది. వ్యాపారులు కనీస శుభ్రత పాటించట్లేదని.. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురికాక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో ...

news

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ...

news

బెంగుళూరులో దారుణం.. రోగిపై ఆంబులెన్స్‌లో అత్యాచారం...

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ...

news

'పాక్‌కు వీసాలు నిలిపేయాలని ట్రంప్‌ను ప్రార్థిస్తున్నా' : ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ వీసాలు తక్షణం నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ...

Widgets Magazine