చంద్రబాబుకు కేక్ కట్ చేసి అభిషేకం చేసిన హిజ్రాలు.. ఎందుకో తెలుసా?

సోమవారం, 18 డిశెంబరు 2017 (14:37 IST)

abhishekam to AP CM

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు హిజ్రాలు పాలాభిషేకం చేశారు. ఎపి మంత్రిమండలి హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో హిజ్రాలు సంబరాల్లో మునిగితేలారు. తిరుపతిలోని దామినేడు వద్ద హిజ్రాలు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
 
కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని సంబరాల్లో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు మాకు దేవుడంటున్నారు హిజ్రాలు. వెయ్యిరూపాయలు మాత్రమే పెన్షన్ కోరితే చంద్రబాబు నాయుడు ఏకంగా 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న విధంగా ప్రతిపాదనే కాకుండా ఆచరణలో కూడా చంద్రబాబునాయుడు పెట్టాలంటున్నారు హిజ్రాలు.దీనిపై మరింత చదవండి :  
Hijras Milk Abhishekam Ap Cm Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి.. వీడియో లీక్..

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్స్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన ...

news

గుజరాత్‌లో బీజేపీని గెలిపించిన మణిశంకర్ అయ్యర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ మరోమారు విజయభేరీ మోగించింది. ప్రభుత్వ ...

తెలుగు లైవ్ : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు క్లిక్ చేయండి

పర్వతశ్రేణి ప్రాంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 18వ ...

తెలుగు లైవ్ : గుజరాత్ పోల్ ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ ...