గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (17:50 IST)

మాల్యా పాస్ పోర్టు ర‌ద్దు... నేను మంచివాడినే అంటాడు కానీ రాడు... అదే అచ్చులో బొమ్మంటే...

విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిఫార్సు మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌

విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిఫార్సు మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపినా మాల్యా హాజరు కాలేదు. దీంతో మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలని విదేశాంగశాఖకు ఈడీ సిఫార్సు చేసింది.
 
ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యాను విచారణకు హాజరు కావాలని ఈడీ మూడుసార్లు సమన్లు పంపింది. తాజాగా ఏప్రిల్‌ 9న మాల్యా విచారణకు హాజరు కాకుండా తనకు మే చివరి వరకు గడువు కావాలని కోరారు. మాల్యాను దేశం విడిచి పోకుండా కట్టడి చేయాలని గతంలో బ్యాంకులు చేసిన విజ్ఞప్తితో... పాస్‌పోర్టుతో కోర్టులో హాజరు కావాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయన అప్పటికే దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు.