Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ వలలో పడి పిండాన్ని మోసింది.. గర్భస్రావం కోసం రక్తం ఎక్కించారు.. వికటించి చనిపోయింది..

శుక్రవారం, 19 మే 2017 (09:13 IST)

Widgets Magazine

ప్రేమికుడిని నమ్మి మోసపోయింది. పిండాన్ని కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్తే కొడతారని.. ఏవేవో మాత్రలు మింగింది. ఫలితం లేకపోవడంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. నిరుపేద కుటుంబం.. కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ పదో తరగతి చదివింది. ఇంతలో ఓ వ్యక్తి పలకరింపుకు ఆ మైనర్ అమ్మాయి ఫిదా అయిపోయింది. సినిమాల ప్రభావమో.. హార్మోన్ల ఆకర్షణ ఫలితమో కానీ.. ప్రేమలో పడింది. మాయగాడి ఉచ్చులో పడి గర్భం దాల్చింది.
 
తనతోపాటు పనిచేసే మరో బాలిక వద్ద తన బాధ వెళ్లగక్కింది. ఆమె ఇచ్చిన సలహాతో ఏవో ట్యాబ్లెట్లు మింగింది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా కడుపునొప్పితో నరకం చవిచూసింది. స్నేహితురాలితో కలిసి ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి బుధవారం వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ఆరోగ్య పరిస్థితి చేయి దాటిపోయినట్టు గుర్తించారు. నాలుగో నెల కావడంతో గర్భస్రావం చేయమని వైద్యులను ప్రాధేయ పడ్డారు. చట్టవిరుద్ధమని వారించినా.. ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బాలికకు వైద్యం అందించిన వైద్యులు.. రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. అయితే వికటించి మైనర్ బాలిక మరణించింది. 
 
ఈ విషయాన్ని స్నేహితురాలు బాలిక కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసింది. బిడ్డ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సైఫాబాద్‌ పోలీసులు, ఆస్పత్రి వర్గాలు, బాలిక బంధువులు చర్చించుకుని కేసు లేకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పేదరికం.. మోసగించిన యువకుడు ఎవరో తెలియ రాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పళని గ్రూప్‌లో ముసలం పుట్టిందా.. 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పన్నీరుకు ఢిల్లీ పిలుపు

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ...

news

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య భీకర కాల్పులు.. 49 మంది మృతి

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు ...

news

చెల్లెల్లాంటిదానివి అన్నాడు.. కెమెరాలో మొత్తం తీసేశాడు.. రెండ్రోజుల్లో 50 లక్షలమంది చూసేశారు

ఆ వ్యక్తి రైల్లో తన ఎదురు సీట్లో ఉన్న మహిళను ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని ...

news

పాక్‌పై భారత్‌కు అతి గొప్ప దౌత్య విజయం.. దేశంలో సంబరాలు

చాలా కాలం తర్వాత భారతదేశం తన దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద దౌత్య ...

Widgets Magazine