Widgets Magazine

ప్రశ్నిస్తానన్న మొనగాడు పత్తాలేకుండా పోయాడు: పవన్‌పై రోజా విమర్శలు

శుక్రవారం, 30 జూన్ 2017 (10:32 IST)

Widgets Magazine

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. రబ్బర్‌ సింగో, గబ్బర్‌ సింగో.. ప్ర‌శ్నిస్తాన‌న్న మొనగాడు ఇప్పుడెక్క‌డున్నాడు? పత్తాలేకుండా పారిపోయాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో గురువారం జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... కాపులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఆమె నిలదీశారు. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌న‌ని చెప్పుకున్న జ‌న‌సేనాని ఇప్పుడు జీఎస్టీ వ‌ల్ల ప‌డ‌బోతున్న ప‌న్నుపోటు గురించి ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. 
 
మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నేత‌లపై కూడా రోజా నిప్పులు చెరిగారు. గిరిజ‌నుల‌ ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని క‌లిసే రాష్ట్ర‌మంత్రులు.. ఇప్పుడు గిరిజ‌నుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. 
 
పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్‌ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్ - చైనా దేశాల మధ్య టెన్షన్.. టెన్షన్... భారీ సంఖ్యలో బలగాల మొహరింపు

భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు భారీ సంఖ్యలో ...

news

వారణాసిలో దారుణం.. 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళపై గార్డు అత్యాచారం

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ ...

news

పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు

పీకల వరకు మద్యం సేవించి పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడికి ఓ వధువు ...

news

లింగ నిర్ధారణ చేస్తాడు.. ఆడపిల్ల అయితే అమ్మాల్సిందే.. వైద్యుడి వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ డాక్టర్ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ...