Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లుడు.. మా పాపకు టిక్కెట్ కావాలి, జారుకున్న జగన్ మోహన్ రెడ్డి

సోమవారం, 20 మార్చి 2017 (12:50 IST)

Widgets Magazine
mohan babu

ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ జరగడానికి మరో రెండుసంవత్సరాలకు పైగా సమయం ఉంది. అయితే ఇప్పుడెవరబ్బా టిక్కెట్ అడుగుతున్నారు.. అది కూడా అల్లుడు అని సంబోధిస్తూ అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.. మీకే అర్థమవుతుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కుమార్తె మంచులక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని అడిగారట. 
 
అవును.. మీరు చదువుతున్నది నిజమే. మంచు లక్ష్మికి టిక్కెట్ అడిగిన వెంటనే జగన్ ఆశ్చర్యపోయారట. అల్లుడు నాకు టిక్కెట్టు కావాలని మామ మోహన్ బాబు భీష్మించుకు కూర్చున్నారట. టిక్కెట్ విషయం పక్కన బెడితే అసలు వీరిద్దరికి ఇంత బంధుత్వం ఎక్కడిది అనుకుంటున్నారా. అవును.. మంచు విష్ణు వివాహం చేసుకున్న ఆయన భార్య స్వయానా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. ఆ బంధుత్వం లెక్కన జగన్ మోహన్ రెడ్డి, మోహన్ బాబుకు అల్లుడవుతాడు. ఇది వరస.
 
ఇక వరసల విషయాన్ని పక్కనబెడితే టిక్కెట్ విషయం గురించి చూద్దాం. జగన్‌ను మోహన్ బాబు అడిగిన నియోజవర్గ టిక్కెట్ ఏ ప్రాంతందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అందులో ఒకటి చంద్రగిరి. మరొకటి శ్రీకాళహస్తి. జగన్‌కు ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత సన్నిహితులు ఉన్నారు. అందులో చంద్రగిరి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరొకరు శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, మంత్రి బొజ్జలపై పోటీ చేసి ఓడి పోయిన వ్యక్తి. ఇద్దరూ ఆయనకు అత్యంత సన్నిహితులే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు కావాలని మోహన్ బాబు కూర్చుంటే ఇక చేసేది లేక కొద్ది సేపు ఆలోచించి నాకు కొద్దిగా సమయం కావాలా మామా అని ప్రాధేయపడ్డారట జగన్.
 
మోహన్ బాబు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ముక్కుసూటి మనిషి. ఆయన ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే. అందుకే  ఆయన్ను కొంతమంది మోనార్క్ అంటారు. జగన్ ఎలాగోలా సమయమడిగి అక్కడి నుంచి తప్పించుకున్నారట. అయితే టిక్కెట్ మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకటి కావాలన్నది మోహన్ బాబు పట్టుదల. తాను ఏ పార్టీలో చేరుతానో లేదోనన్న విషయం పక్కనబెట్టి తన కుటుంబ సభ్యులక టిక్కెట్లను తీయించుకునే పనిలో పడ్డారట మోహన్ బాబు. మొత్తం మీద మోహన్ బాబు కుటుంబ రాజకీయాలు ఏ స్థాయికి చేరుతుందో వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియురాలి ప్రేమ కోసం మర్మాంగం, నాలుక బలి... వశీకరా...

ప్రేమ పిచ్చి ముదిరింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా ప్రేమ ముదిరి మూఢుడిగా ...

news

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాకు చుక్కెదురు.. టీడీపీ రవి రికార్డు విజయం

కడప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి చుక్కెదురైంది. కడప స్థానిక సంస్థల ...

news

అందరినీ సమానంగా చూస్తా.. వర్గ వివక్ష చూపబోను... యోగి.. ఎందుకు వెక్కివెక్కి ఏడ్చారు?

హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ...

news

ఈ తెల్లవాళ్లకు ఏం పోయేకాలమొచ్చిందో.. మతబోధకులపైనా దాడులే..

అమెరికానే కాదు.. పాశ్చాత్య ప్రపంచం మొత్తంగా జాతి విద్వేష జ్వాలలో తగులబడుతున్నట్లుగా ...

Widgets Magazine