శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శుక్రవారం, 23 జనవరి 2015 (10:16 IST)

తల్లీ కూతుళ్ల మృతి.. కృష్ణా నదిలో తేలిన శవాలు.. ఎన్నో అనుమానాలు..?

ఏమి కష్ణం వచ్చిందో.. ఏ నష్టం కలిగిందో తెలియదు. తల్లీ కూతుళ్ళిద్దరూ శవాలై తేలారు.. చనిపోయారు. చంపబడ్డారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కృష్ణ జిల్లా తాడేపల్లె గూడెం సమీపంలోని కష్ణానది వంతెన కింద శవాలుగా కనపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 
 
విజయవాడ అయోధ్యనగర్‌లో ఈ నెల 20న అదృశ్యమైన  మహిళ మంత్రి ఈశ్వరమ్మ (33) ఆమె కుమార్తె రాధ(11), కుమారుడితో కలసి రైల్వే గేటు పక్కన సూర్యకాలనీలో జీవనం సాగిస్తుండే వారు. మంత్రి ఈశ్వరమ్మ భర్త అప్పలనాయుడు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. 
అప్పటినుంచి అదే ప్రాంతంలో పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడిని కొంతకాలం కిందట ఊర్మిళానగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉంచింది. కుమార్తెను ఆమె దగ్గరే ఉంచుకుని స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. 
 
20వ తేదీ ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణా రైల్వే బ్రిడ్జి దిగువన కృష్ణానదిలో గురువారం రైల్వే బ్రిడ్జి కింది భాగంలో 7వ ఖానా వద్ద ఒక మహిళ, ఒక బాలిక మృతదేహాలను మత్య్సకారులు గుర్తించారు. సమాచారం విజయవాడ పోలీసులకు ఇవ్వడంతో ఈశ్వరమ్మ మరిది వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 
 
ఆమెకు ఆరోగ్యం సరిగాలేదని యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లతో ఎలా బతకాలి అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అయితే కుమార్తె రాధిక మృత దేహాన్ని పరిశీలిస్తే ఈ మరణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. బాలిక నాలుక బైటకు వచ్చి పల్లతో పట్టేసి ఉంది. ఇది నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదే అయితే ఇలా ఉండదు. 
 
ఉరి వేసుకున్నప్పుడో, గొంతు నులిమి చంపినప్పుడో మాత్రమే ఇలా నాలుక బైటకు వస్తుందని శవ పరీక్ష నిపుణులు చెబుతున్నారు. తల్లి ఈశ్వరమ్మ కూతురు రాధికను గొంతు నులిమి కృష్ణా నదిలోకి పడేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా తల్లిని ముందు నదిలో తోసి కుమార్తె గొంతు నులిమి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.