శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 25 మే 2016 (16:29 IST)

​భీమిలి 'స‌త్తెమ్మ' త‌ల్లి సాక్షిగా ముమైత్ ఖాన్ ఆట‌... పాట‌కు అక్ష‌రాలా ల‌క్ష‌! (వీడియో)

భీమిలి: రికార్డింగ్ డాన్స్ అంటే... కుర్ర‌కారు హుషారుగా ఎగ‌బ‌డ‌తారు. మ‌రి అది ముమైత్ ఖాన్ రికార్డింగ్ డాన్స్ అంటే...ఇక ఆగుతారా? చెల‌రేగిపోరూ... విశాఖ జిల్లా భీమిలి మండ‌లం చిప్పాడ గ్రామ దేవ‌త శ్రీ స‌త్త‌మ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా

భీమిలి:  రికార్డింగ్ డాన్స్ అంటే... కుర్ర‌కారు హుషారుగా ఎగ‌బ‌డ‌తారు. మ‌రి అది ముమైత్ ఖాన్ రికార్డింగ్ డాన్స్ అంటే...ఇక ఆగుతారా?  చెల‌రేగిపోరూ... విశాఖ జిల్లా భీమిలి మండ‌లం చిప్పాడ గ్రామ దేవ‌త శ్రీ స‌త్త‌మ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో సినిమా ఆర్టిస్ట్ ముమైత్ ఖాన్ స్టెప్పులేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. 
 
ఆమె ఆట‌, పాట‌... ఊపు చూడ్డానికి లక్ష మంది పైనే హాజర‌య్యారు. బాబూ... ఓ రాంబాబూ అంటూ... ముమైత్ ఖాన్ స్టెప్పులేస్తూ, ప్రేక్ష‌కుల‌కు మ‌త్తెక్కించింది. ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే అంటూ, న‌డుము ఊపి కుర్ర‌కారును హుషారెత్తించింది. నా పేరు ముమైత్ ఖాన్ అంటూ... ఆమె ఏడు పాట‌ల‌కు సెక్సీ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేసింది. అఫ్‌కోర్స్ పాట‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఏడు ల‌క్ష‌లు పారితోషికం తీసుకుందిలెండి... ద‌టీజ్ ముమైత్ ఖాన్!