శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 మే 2016 (19:45 IST)

సచిన్-లతా మంగేష్కర్ పై వ్యంగ్యం... గూగుల్ నుంచి తొలగించాలంటూ... ఇంతకీ అందులో ఏముందంటే...(Video)

ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ నటిస్తూ ఏఐబీ కామెడీ గ్రూప్ రూపొందించిన వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనికి కారణం ఆ కామెడీ సీన్లు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, గానకోకిల లతా మంగేష్కర్ పైన తీయడమే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చే

ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ నటిస్తూ ఏఐబీ కామెడీ గ్రూప్ రూపొందించిన వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనికి కారణం ఆ కామెడీ సీన్లు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, గానకోకిల లతా మంగేష్కర్ పైన తీయడమే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. 
 
ఈ వీడియోకు భట్ 'సచిన్ వర్సెస్ లతా సివిల్ వార్' అని టైటిల్ పెట్టి అందులో వారి స్వరాలను అనుకరిస్తూ చేశాడు. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ వీడియోను తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంటగంటకూ ఈ వీడియోపై తిట్లు అధికమవుతుండటంతో ముంబై పోలీసులు వీడియోను తొలగించేందుకు గూగుల్ ను సంప్రదించే పనిలో ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీరూ ఓసారి లుక్ వేయండి.