Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెటిల్ చేస్తానని సీన్లోకి ఎంటరయ్యాడు... చివరకు సూసైడ్ చేసుకున్నాడు.. ఇదీ ఎస్ఐ కథ!

గురువారం, 15 జూన్ 2017 (10:09 IST)

Widgets Magazine
sirisha - prabhakar reddy

హైదరాబాద్ బ్యూటీషియన్‌కు ఆమె పని చేసే సంస్థ యజమానికి మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించేందుకు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎంటరైనట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మిస్టరీగా మారిన బ్యూటీషన్, ఎస్ఐ ఆత్మహత్య కేసులో పోలీసులు సగం మిస్టరీని ఛేదించారు. అయితే, శిరీష‌ను ఎస్ఐ రేప్ చేసి హత్య చేశాడా? లేక ఆమె స్వయంగా ఆత్మహత్య చేసుకుందా? ఎస్ఐ కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనేది ఇపుడు పోలీసులకు పెద్ద చిక్కుముడిగా మారింది. ఈ ముడిని విప్పే పనిలోనే పోలీసులు ఉన్నారు. 
 
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో ఆర్జీఏ స్టూడియోలో మేకప్ ఆర్టిస్ట్‌గా శిరీష పని చేస్తూ వచ్చింది. ఈ స్టూడియో యజమాని రాజీవ్‌కు తేజస్విని అనే ప్రేయసి ఉంది. అయితే రాజీవ్ తన సంస్థలో పని చేసే శిరీషతో చనువుగా ఉంటున్నాడని, వారి బంధం నేపథ్యంలో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తేజస్విని అనుమానించింది. ఫలితంగా వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. 
 
ఈ నేపథ్యంలో తమ సమస్యను పరిష్కరించాలని రాజీవ్ తన స్నేహితుడు శ్రావణ్‌ను ఆశ్రయించాడు. దీంతో శ్రావణ్ వారి మధ్య సమస్యను పరిష్కరించేందుకు తన స్నేహితుడు ఎస్ఐ ప్రభాకర్‌ రెడ్డిని రంగంలోకి దించాడు. అయితే, సెటిల్ చేస్తానని సీన్లోకి ప్రభాకర్ రెడ్డి ఎంటర్ కావడంతో పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్, తేజస్విని, శ్రావణ్ హైదరాబాదుకు 71 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా చోటుచేసుకున్న చర్చలు, లేదా ఇతర ఘటనల నేపథ్యంలో శిరీష తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. ఇంతవరకు జరిగింది తెలిసినా ఆ తరువాత ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. అనంతరం చోటుచేసుకున్న ఘటనలే శిరీషది హత్యా? లేక ఆత్మహత్య?... శిరీషపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారం చేశాడా? లేదా?... ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అన్న వివరాలపై క్లారిటీ కోసం పోలీసులు విచారణ జరుపనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mystery Telangana Si's Suicide Beautician's Death

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్నేహితుడిని రక్షించడానికి అబద్ధం చెప్పింది.. సీన్ రివర్స్ అయ్యింది..

తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని.. అది కూడా తన స్నేహితుడి ఎదుటే జరిగిందని అబద్ధం ...

news

నా భార్య అలాంటిది కాదు : బ్యూటీషియన్ శిరీష భర్త ఆవేదన

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ...

news

'కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నా'ను.. కుకునూరు పల్లిలోఎస్ఐ చివరి మాటలేంటంటే!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్‍‌లో ఎస్.ఐ. ...

news

మొన్న ప్రదీప్, నిన్న శిరీష.. సెలబ్రిటీలు, వారికి సేవ చేసేవారు కూడా చస్తూ బతకాల్సిందేనా..

సెలబ్రెటీలు, వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం ...

Widgets Magazine