శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (10:18 IST)

నాగాలాండ్‌లో తెలుగు ఇంజనీర్ల కిడ్నాప్ కథ సుఖాంతం!

నాగాలాండ్‌లో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు తెలుగు ఇంజనీర్ల కథ సుఖాంతమైంది. తెలుగు ఇంజనీర్లు ప్రతీష్ చంద్ర, రఘు విడుదలయ్యారు. ఈ ఇద్దరు ఇంజనీర్లు పనిచేస్తున్న ప‌ృథ్వి కన్‌స్ట్రక్షన్స్, రత్నా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఉగ్రవాదులతో జరిపిన చర్చలు ఫలించడంతో ఇంజనీర్లు విడుదలయ్యారు. కిడ్నాపైన ఇంజనీర్లను విడిపించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కూడా వీరు త్వరగా విడుదల కావడానికి దోహదపడిందని తెలుస్తోంది. విడుదలైన ఇద్దరు ఇంజనీర్లు బుధవారం సాయంత్రానికి విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. కాగా ఇంజనీర్లు పనిచేస్తున్న కంపెనీల యాజమాన్యం ఉగ్రవాదులకు భారీ మొత్తం ముట్టజెప్పడం వల్లే వీరిని విడుదల చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  
 
ఇంజనీర్లు విడుదల అయిన విషయాన్ని విజయవాడలోని వారి కుటుంబ సభ్యులకు కంపెనీ ప్రతినిధలు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈనెల 27న రఘు, ప్రతీష్‌చంద్రలను బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఫృద్వీ కన్‌స్ట్రక్షన్స్, రత్నా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీల ప్రతినిధులు తీవ్రవాదులతో చర్చలు జరడంతో సఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. దీంతో ఇంజనీర్ల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.