శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:24 IST)

శ్రీశైలంలోనే కాదు.. నాగార్జున సాగర్‌లో కూడా తెలంగాణా విద్యుదుత్పత్తి!

శ్రీశైలంలోనే మాత్రమే కాకుండా నాగార్జున సాగర్‌లోనూ తెలంగాణ విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. తద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయడం వివాదాస్పదంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 
 
ప్రస్తుతం నాగార్జునసాగర్లో 27వేల క్యూసెక్కుల నీటితో తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు.
 
సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే నాగార్జున సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు.